1, మార్చి 2021, సోమవారం

శిశిరం ఫిర్యాదు 


మరియా నన్నొదిలి మరో నక్షత్రానికి వెళ్ళేవరకూ - ఏ నక్షత్రం,కాలభైరవ,శ్రవణం - లేదంటే నువ్వా పచ్చ వీనస్? - నేను ఎప్పుడూ ప్రేమిస్తాను ఏకాంతాన్ని. ఎన్ని సుదీర్ఘమైన రోజులు గడిపాను ఒంటరిగా నా పిల్లితో. ఒంటరిగా అంటే దానర్ధం ఆవశ్యకమైంది ఏదీలేకుండా,నా పిల్లి ఒక మార్మికమైన చెలికత్తె. ఒక ఆత్మ. నేను చెప్పాల్సింది ఏమిటంటే సుదీర్ఘమైన ఒంటరి రోజులు గడిపాను నా పిల్లితో ఇంకా ఒంటరిగా ఒకానొక నైతికపతనం చెందిన చిట్టచివరి రోమన్ గ్రంథకర్తతో. అప్పటినుండీ లేదు ప్రేమించేందుకు మరో తెల్లపురుగు,చోద్యం అసమానత, ప్రతిదీ కూర్చబడుతుంది పదంలో: పతనం.అలా,సంవత్సరంలో, నా ప్రియమైన కాలం గ్రీష్మం చివరి మందగమనం అది రమారమి శిశిరస్థానం.ఇంకా,పగలు నేను నడిచే సమయంలో ఎప్పుడైతే సూర్యుడు సందేహిస్తాడో అంతర్ధానమయేముందు,పసుప్పచ్ఛ కంచు కిరణాలు బూడిదరంగు గోడలమీద,ఇంకా ఎర్రని రాగి కిరణాలు పెంకులమీద.సాహిత్యం కూడా,ఏ విషయాసక్తత నుండీ నా ఆత్మ అడుగుతుందో అదే వేదన కలిగించే రోమన్ కవిత్వపు చివరి క్షణాలు.చాలాకాలంగా శ్వాసించనట్లుగా ఈ అమర్యాదస్తుల దృఢ ధృక్పథం లేదా పిల్లతనపు నంగితో లాటిన్ లో మాట్లాడినట్లుగా క్రైస్తవ వచనం.అప్పుడు నేను చదువుతాను ఆ ప్రియమైన కవితల్లో ఒకటి.(ఏ ఎర్రచూర్ణపు పొలుసులైతే నాకు మరింత ఆకర్షణీయమౌతాయో యవ్వనపుష్టిని మించి),జంతువుల నాణ్యమైన బొచ్చులో చేయిపెట్టినట్లు,అప్పుడో వీధి వాయిద్యం ధ్వనిస్తుంది సోలిపోతూ దుఃఖంతో నా కిటికీ కింద.అది ధ్వనిస్తూనే వుంటుంది బూరుగుచెట్టు ఆకులవంటి గొప్పఇరుకుప్రదేశాల్లో,వసంత కాలంలో కూడా,దుఃఖకరంగా కనబడుతున్నాయి నాకు మరియా వాటితో వెళ్లిన నాటినుండీ,ఆమె చివరి ప్రయాణం,కొవ్వొత్తుల నడుమ అబద్ధం.విచారకరమైన వాయిద్యం,అవును,తప్పకుండా:పియానో తళతళలాడుతోంది,ఈ వయోలిన్ యిస్తోంది కాంతిని చిరిగిన పొరలోంచి,కానీ ఈ వీధి వాయిద్యపు జ్ఞాపకాల అరకొర కాంతి కలలుకంటోంది నిరాశగా. ఇప్పుడిది గొణుగుతోంది ఆహ్లాదకరంగా సాధారణమైన పాటని ఉల్లాసంతో శివారు ప్రాంతాలని నింపుతూ,పాతదైన,ఏ విశేషమూలేని బాణీ:ఎందుకీ పదాలు నా ఆత్మని చీల్చి ఏడిపిస్తాయి నన్ను,శృంగార జానపద గీతాలేవైనా?నేను నెమ్మదిగా రుచి చూస్తాను ఐతే విసరను నాణాన్ని కిటికీగుండా ఎందుకంటే నా ఆత్మని సంకటపరిచే భయాన్నుండి అనాచ్చాదితం చేసేది మాత్రమే కాదు ఈ వాయిద్యం ఆలపిస్తోంది.



                                                             Stephane Mallarme
                                                                    French Poet
                                                                     (1842-1898)

                                                   

20, మార్చి 2020, శుక్రవారం

గొంగళిపురుగు

                          గొంగళిపురుగు

                                                                      -  గియ్యోం అపొలినేర్          

                                                              
కవులారా శ్రమించాలి,వుత్సాహంతో కూడిన శ్రమ:
శ్రమే దారితీస్తుంది సౌభాగ్యానికి భయాన్నుండీ స్వేఛ్ఛకి;
సీతాకోకచిలుకలూ,వాటి సొగసులన్నింటిమీదా
శ్రద్ధ కలిగివుండేవి మాత్రం గొంగళిపురుగులే. 


కవిత పేరు  :   Caterpillar 
మూలకవి    :  Guillaume apollinaire
దేశం            :  France

వీడ్కోలు

                        వీడ్కోలు   

                                                                           ----    Guillaume Apollinaire


నేను తెంచాను అడవిపొద రెమ్మని
మరువకు మరణించిన శిశిరాన్ని
మనం ఎప్పటికీ తిరిగి కలవం ఐనా
సమయం జాడా అడవిపొద రెమ్మా 
నేనూ నిరీక్షిస్తూనేవుంటాం మరువకు.

కవిత పేరు  : The Parting
మూలకవి    : Guillaume Apollinaire
దేశం            :  France